JAISW News Telugu

Rohit Sharma : రోహిత్ శర్మ తీరుపై విమర్శలు.. తల్లి అంటే ప్రేమ లేదా 

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma : టీం ఇండియా కెప్టెన్ గా సక్సెస్ ఫుల్ అయిన రోహిత్ శర్మ టీ 20 వరల్డ్ కప్ కూడా గెలిపించాడు. ముంబయిలో బీసీసీఐ టీం సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో రూ. 125 కోట్ల రూపాయల చెక్ ను కెప్టెన్ రోహిత్ శర్మకు అందజేశారు. 

అయితే అక్కడ సెలబ్రేట్ చేసుకునే బయటకు వచ్చిన తర్వాత రోహిత్ శర్మను తల్లి పూర్ణిమ ముద్దులు పెడుతూ అప్యాయతను చాటుకుంది.  ఆ సమయంలో రోహిత్ శర్మ కాస్త వాళ్ల అమ్మపై విసుక్కున్నాడు. దీంతో నెటిజన్లు రోహిత్ శర్మపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. భార్య, కూతురు పై ఉన్న ప్రేమ తల్లిపై ఎందుకు లేదో అని అడుగుతున్నారు. మరి ఇంతలా విసుక్కోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. 

అయితే రోహిత్ శర్మ తన కూతురు, భార్యపై విపరీతంగా ప్రేమ ఒలకబోసే కెప్టెన్ సాబ్ ఇలా ఎందుకు చేశారని అతడి ఫ్యాన్స్ మనసు నొప్పించుకుంటున్నారు. అయితే చాలా మంది ఫ్యాన్స్ మాత్రం రోహిత్ అలా కావాలనే చేయలేదు. ఏదో అలా జరిగిపోయింది. అయితే రోహిత్ కు తల్లి అన్న కూడా ఎంతో ప్రేమ ఉంది. అక్కడ జనం ఎక్కువగా గుమిగూడటం ఇబ్బంది కరంగా ఉండటంతో కాస్త విసుక్కున్నట్లు కనిపించినా అది ఆయన తల్లిపై కాదని చెబుతున్నారు. 

టీ20 ప్రపంచ కప్ గెలిచిన సంబరాల్లో టీం ఇండియా ఉండగా.. ఇలాంటి పనికి మాలిన ముచ్చట్లు పెట్టడం ఎందుకు అంటూ కొంతమంది నెటిజన్లపై కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది కావాలనే ఇలా వివాదం చేయాలని చూస్తున్నారని రోహిత్ శర్మ చాలా మంచి వ్యక్తి అని అంతకంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నారు. రోహిత్ గురించి తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతుంటారని అంటున్నారు. దీన్ని అలా చూపి కామెంట్లు చేయడం సరికాదని సూచిస్తున్నారు.

Exit mobile version