Animal:సినిమాని సినిమాగానే చూడాలి. అందులో తప్పులు..లాజికల్ లు వెతికితే! అది సినిమా ఎలా అవుతుంది. సినిమాటిక్ గా ఎలా రూపంతరం చెందుతుంది. నచ్చిన వారు చూస్తారు..నచ్చని వారు చూడరు! అన్నది సందీప్ వంగ సిద్దాంతం. యానిమల్ విషయంలో మార్కెట్ లో ఓ వర్గం ఎంతలా టార్గెట్ చేస్తున్నారో? కళ్ల ముందు కనిపిస్తునే ఉంది. యానిమల్ లో హింసని..కృరత్వాన్ని చూపించారని..అలా ఎలా చేస్తారాని లాజిక్కులు తెరపైకి తెస్తున్నారు.
అయినా వాటితో సంబంధం లేకుండా యానిమల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తునే ఉంది. పనిగట్టుకుని కొంతమంది సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నా? అవెక్కడా యానిమల్ టచ్ కూడా చేయలేకపోతున్నాయి. నిజంగా ఆప్రభావం గనుక సినిమా మీద పడితే వసూళ్లు డే బై డే ఎందుకు పెరుగుతాయి? జనాలకు సినిమా నచ్చకపోతే థియేటర్ కి వెళ్లి ఎందుకు చూస్తారు? అన్న చిన్న లాజిక్ ని మాత్రం వ్యతిరేక వర్గం విస్మరిస్తున్నట్లే కనిపిస్తుంది.
ఒక సినిమా విషయంలో లాజిక్కులు చూడాలి? ప్రేక్షకుల కోణాన్ని చూడా? అంటే కచ్చితంగా ప్రేక్షకుల కోణం నుంచి సినిమాని చూడాలి. అంతిమంగా న్యాయ నిర్ణేతలు వారే కాబట్టి వారిదే తుది నిర్ణయం. వాళ్లు ఇచ్చిన తీర్పునే అంతా స్వాగతించాలి. తాజాగా సినిమాటోగ్రాఫర్ సిద్దార్ద్ మని ఈసినిమాని ఉద్దేశించి కొన్ని నెగిటివ్ కామెంట్లు చేసాడు. అందులో విచ్చల విడిగా శృంగారం ఉందని.. రక్తపాతాన్ని ప్రోత్సాహిం చారని.. మృగ వాంఛ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని తన అసహనాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేసారు. వాస్తవానికి సినిమాలో అంత విచ్చల విడి శృంగారం లేదు..దారుణమైన రకచరిత్ర లాంటి రక్త పాతం లేదు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి కామెంట్లు చేసారని యానిమల్ టీమ్ ఖండిస్తుంది. తమ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే అసూయతోనే అర్దం లేని కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. మరి ఆ ఛాయాగ్రాహకుడి వ్యాఖల్యపై వర్మ ఎలా రియాక్షన్ ఎదైనా ఉంటుందా? అన్నది చూడాలి. ఎందుకంటే యానిమల్ కి వర్మ కంటే వీరాభిమాని ఎవరు ఉండరేమోనని అతను సినిమాని మెచ్చిన వైనాన్ని బట్టి చెప్పొచ్చు.