Kaleshwaram : కాళేశ్వరం’పై అబద్దాలు చెబితే క్రిమినల్ కేసులు
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వైఫల్యానికి అధికారులు సరైన వివరాలు వెల్లడించాలని కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ స్పష్టం చేశారు. విచారణలో చెప్పిన అంశాలనే అఫిడవిట్లో పొందుపరచాలని స్పష్టం చేశారు. అందులో పేర్కొన్న వివరాలు వాస్తవ విరుద్ధంగా ఉంటే ఆయా అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
కాగా, బ్యారేజీలపై విచారణకు ప్రభుత్వం ఘోష్ అధ్యక్షతన కమిషన్ ను నియమించింది. కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ మంగళవారం క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లను పలు అంశాలపై ప్రశ్నించారు. వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీల స్థితిగతులపై తెచ్చుకున్న నివేదికలపై స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అధికారులను విచారించారు.