Sajjala Ramakrishna : ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో వచ్చేది ఏ ప్రభుత్వమా అని మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా… ఎవరిని కదిలించినా… రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చ నడుస్తోంది. ఇక మరి కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు… ఏపీ ఎన్నికల ఫలితాలపై లక్షల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు. తెలుగుదేశం కూటమి ఈ సారి కచ్చితంగా గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ కాస్తుంటే.. లేదు లేదు వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమని కొందరు ఆస్తులు కూడా బెట్టింగ్ చేస్తున్నారు. ఇలా.. పోలింగుకు, ఫలితాలకు మధ్య రోజుల తేడా ఉండడంతో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి నెలకొంది.
ఇలాంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహాదారులు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన పై క్రిమినల్ కేసు తాజాగా నమోదైంది. తెలుగుదేశం పార్టీ న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా రెండు రోజుల కిందట రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపైన టీడీపీ న్యాయవాది లక్ష్మీనారాయణ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది.
ఐ.పి.సి లోని u/s, 153, 505 ఐపీసీ, 125 RTA 1951 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా… లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ఏపీకి చేరుకుంటారు. లండన్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకుంటారు.అనంతరం గన్నవరం నుంచి తాడేపల్లి లోని తన ఇంటికి వెళ్తారు.