Home Minister Anita : గత ప్రభుత్వ వైషల్య వలననే ఏపీలో నేరాలు పెరగడానికి కారణమంటూ హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తు చేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు, అసలు ఆ చట్టం ఉందా..? దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయని నిలదీశారు. ప్రస్తుతం క్రైం రేటు తగ్గిందన్నారు. కానీ, అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దు అని విజ్ఞప్తి చేశారు.
2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మహిళల మీద జరిగిన దాడులు అందరు చూశారని అనిత అన్నారు. అప్పటి సీఎం ఇంటి పక్కనే అత్యాచారం చేసి హత్యలు చేసినా నిందితులను పట్టించుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. కానీ, కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలే నేరాలు పెరగడానికి కారణమని మంత్రి ఆరోపించారు.