Crime News : కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం జరిగింది. మహిళ డయల్ 100 నంబర్ కు కాల్ చేయడంతో విషయం వెలుగు చూసింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో మహిళపై అఘాయిత్యం జరిగింది. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో బస్సు డ్రైవర్లు కృష్ణ, సిద్దయ్యలు ఇదే అదనుగా భావించి బస్సు అద్దాలను మూసివేశారు. ఆ తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ వెంటనే డయల్ 100 నంబరుకు కాల్ చేసి ఈ అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు సమాచ