JAISW News Telugu

Crime News : నాలుగేళ్ల కొడుకును చంపి.. బ్యాగులో పెట్టుకుని..లేడీ సీఈవో దారణం

Crime News

Crime News, suchana

Crime News in Bangalore : బెంగళూరు స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో గోవాలోని ఓ హోటల్ లో తన నాలుగేండ్ల కొడుకును హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోంది. డెడ్ బాడీని బ్యాగ్ లో పెట్టుకుని ట్యాక్సీలో బెంగళూరు వెళ్లింది. గోవా పోలీసుల సమాచారం మేరకు కర్నాటక పోలీసులు మహిళా సీఈవోను అరెస్ట్ చేసి, ఆమె కుమారుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు.

ఆ మహిళా సీఈవో పేరు సూచనా సేథ్(39). ఆమె మైండ్ పుల్ ఏఐ ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, సీఈవో కూడా. జనవరి 6న చిన్నారి కొడుకుతో కలిసి గోవాలోని సోల్ బన్యన్ గ్రాండే హోటల్ కు వెళ్లింది. జనవరి 8న హోటల్ నుంచి చెక్ అవుట్ చేసింది. భర్తతో విభేదాల కారణంగా ఆమె తన కొడుకును దారుణంగా చంపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..సూచనా సేథ్ తన భర్తతో బిడ్డ కలువకుండా నిరోధించేందుకు ఈ దారుణ చర్యకు పాల్పడింది. ఈ జంట 2010లో వివాహం చేసుకున్నారు. వారికి 2019లో కొడుకు జన్మించాడు. అయితే వివాదాల కారణంగా 2020లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారాల్లో తన బిడ్డను కలిసేందుకు తండ్రికి కోర్టు అనుమతి ఇచ్చిందని గోవా డీజీపీ జష్ పాల్ సింగ్ చెప్పారు. తన భర్త తమ కొడుకును చూడకుండా ఆపాలనే ఉద్దేశంతో నిందితురాలు తన బిడ్డతో కలిసి గోవా పర్యటనకు ప్లాన్ చేసింది. షెడ్యూల్ కు ముందు నార్త్ గోవాలోని హోటల్ గదిలో చిన్నారిని హత్య చేసింది. మహిళ తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయ్యింది. చెక్ అవుట్ మాత్రం ఒంటరిగా వెళ్లడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది.

ఇదే విషయమై హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది మాత్రమే కాదు సూచనా సేథ్ గోవా నుంచి బెంగళూరు వెళ్లడానికి హోటల్ సిబ్బందిని ట్యాక్సీ బుక్ చేయమని కూడా కోరింది. ట్యాక్సీలో వెళ్లే బదులు ఫ్లైట్ లో వెళితేనే బాగుంటుందని సిబ్బంది ఆమెకు చెప్పారు. ఆ తర్వాత కూడా విమానంలో వెళ్లకుండా ట్యాక్సీనే బుక్ చేసుకున్నారు. ఈక్రమంలో హోటల్ గదిని హౌస్ కీపింగ్ చేసే వ్యక్తులు శుభ్రం చేస్తుండగా రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ తో  మాట్లాడారు.. అలాగే సూచనా సేథ్ తో మీ కొడుకు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. దీంతో తన స్నేహితుడి దగ్గర ఉన్నాడని ఆమె వారికి చెప్పింది. పోలీసులు అడ్రస్సు అడగగా.. ఏదో ఒక చిరునామా వారికి ఇచ్చింది. అక్కడికి వెళ్లిన పోలీసులు అది ఫేక్ అడ్రస్ అని తెలుసుకుని.. ఆమె అబద్ధాలు చెబుతోందని నిర్ధారించుకున్నారు. ఆమెను సీరియస్ గా విచారణ చేశారు. కారులో ఉంచిన బ్యాగును తెరిచి చూడగా అందులో చిన్నారి డెడ్ బాడీ కనిపించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Exit mobile version