Crime News : నీటి కోసం వెళ్లి శవమయ్యాడు.. కేసు నమోదు

Crime News : దప్పిక తీర్చుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ నెలకొన్న స్వల్ప వివాదంతో శవమయ్యాడు. హైదరాబాద్ మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ సంఘటన జరిగింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడగట్టుకు చెందిన సాయిలు (35) గ్రామంలో కూలీ పనులు చేసుకునేవాడు. కొంతకాలంగా గ్రామంలో పనులు తక్కువగా ఉండడంతో నగరానికి వచ్చి బీరంగూడలో భార్య మీనా, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. బొల్లారం చౌరస్తాలోని అడ్డా వద్ద లారీల నుంచి ఇసుకను అన్ లోడ్ చేసే పని చేస్తున్నాడు.

సాయిలు శుక్రవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో అడ్డా వద్ద ఓ టీ దుకాణంలో సీసాలో నీరు తెచ్చుకునేందుకు వెళ్లాడు. నీరు తాగి బాటిల్ లో ఎందుకు పట్టుకుంటున్నావని టీ దుకాణంలో పనిచేసే సతీష్ ప్రశ్నించడంతో స్వల్ప గొడవ జరిగింది. ఇదే సమయంలో సతీష్ స్నేహితులిద్దరు అక్కడికి వచ్చారు. వీరంతా మూకుమ్మడిగా సాయిలుపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించామని, మృతుని బంధువుల ఫిర్యాదుతో కేసు నమ్ోదు చేశామని సీఐ దుర్గారామలింగ ప్రసాద్ తెలిపారు. సాయిలు మృతితో తోటి కార్మికులు మియాపూర్ కు తరలివచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, సాయిలు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

TAGS