Crime News : రూ.18.52 లక్షలతో పరారీ.. పట్టుకున్న పోలీసులు
Crime News : ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద చోరీ సొత్తుతో పరారవుతున్న లారీ క్లీనర్ ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.18.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ పోలీస్ స్టేషన్ లో నిందితుడిని ఏసీపీ రవికిరణ్ విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఏసీపీ కేసు వివరాలను తెలిపారు.
తెలంగాణలోని మధిర నుంచి ఈనెల 17న లారీలో 300 బస్తాల మిర్చిని ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ తీసుకెళ్లారు. అక్కడ మిర్చిని విక్రయించిన అనంతరం లారీ డ్రైవర్ షేక్ ఖయ్యూం ఆ డబ్బు తీసుకుని క్లీనర్ పల్లెపోగు కోటేశ్వరరావుతో కలిసి బయల్దేరాడు. అనంతరం క్లీనర్ రూ.18.52 లక్షలతో అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో నందిగామ పోలీసులకు లారీ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వాహనాల తనిఖీ చేపట్టారు. నందిగామ ఆటో స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న క్లీనర్ కోటేశ్వరరావును పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు కోటేశ్వర రావును పోలీసులు అరెస్టు చేశారు.