ఈ విషయాన్ని బాలురు ఇంట్లో చెప్పడంతో అదే రోజు రాత్రి శవాన్ని పుట్టిలో వనములపాడు మీదుగా కృష్ణానదిలో తీసుకెళ్లి తాడుతో రాయికి కట్టి నీటిలో పడేశారు. విషయాన్ని నిందితుల్లోని ఒక బాలుడి తండ్రి, పెదనాన్న పోలీసులకు చెప్పడంతో నేరానికి పాల్పడ్డ ముగ్గురు బాలురతో పాటు వీరిద్దరిని కలిపి ఐదుగురిని రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. బాలిక మృతదేహం కోసం గజఈతగాళ్ల సాయంతో వెతుకుతున్నామని వివరించారు.
* ఆర్థిక నేరస్తుడు సుకేశ్ చంద్రశేఖర్ భార్యకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సుకేశ్ కుటుంబానికి చెందిన 26 లగ్జరీ కార్లను విక్రయించేందుకు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా వచ్చిన నగదును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్.. ఆర్థిక మోసాలు చేసి వందల కోట్లు సంపాదించినట్లు ఈడీ ఆరోపించింది. ఆయన లగ్జరీ కార్లను అమ్మేందుకు ఈడీ ట్రయల్ కోర్టు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం వాహనాల భద్రత, జీవనకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విక్రయించడమే ఉత్తమమని ఈడీకి ఆదేశాలిచ్చింది.
* సోషల్ మీడియా పరిచయాలతో ప్రేమలో పడి వివాహాలు చేసుకుంటున్న జంటలను చూస్తుంటాం. అదే విధంగా అమెరికాకు చెందిన ఒక మహిళ, ఇండియాలోని పురుషుడిని వివాహం చేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. అమెరికా, టెక్సాస్‌కు చెందిన జాక్వెలిన్ ఆస్టిన్ (78)కు భారత్‌కు చెందిన భరత్ జోషి (34) ఫేస్ బుక్ కు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆస్టిన్ సదరు యువకుడు భరత్ జోషి గ్రామమైన రాజస్థాన్‌లోని కోటాకు గత ఆగస్ట్ లో వచ్చి వివాహం చేసుకుంది. అమెరికాలోని ఆమె కుటుంబ సభ్యులతోనూ టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఆస్టిన్ అనారోగ్యానికి గురవడంతో హాస్పిటల్ లో చేర్పించారు. ఆరోగ్యం క్షీణించడంతో జైపూర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ మరణించింది.
* వైద్యం కోసం కజకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళ (51)పై ఒక యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో లో జరిగింది. గురుగ్రామ్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన సదరు మహిళ ఆర్థోస్కొపీ సర్జరీ చేయించుకుంది. నిందితుడు ఠాకూర్ సింగ్ (24) అదే హాస్పిటల్ లో అటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం మహిళ మత్తులో ఉన్న సమయంలో ఈ దుశ్చర్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు. జూలై 9న చికిత్స కోసం ఆమె హాస్పిటల్ కు వచ్చింది. శనివారం శస్త్రచికిత్స పూర్తి చేసి వార్డుకు తరలించగా.. ఆమె వెంట కుమార్తె కూడా ఉంది. తన తల్లిపై లైంగిక దాడి జరిగిందని గుర్తించిన కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో తన తల్లి బెడ్ పక్కన ఠాకూర్ సింగ్ మాత్రమే ఉన్నట్లు ఆమె చెప్పింది. ఈ వ్యవహారంపై హాస్పిటల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. రోగుల భద్రతకే అధిక ప్రాధాన్యం ఇస్తామని, ఈ ఘటనలో నిష్పాక్షిక దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపారు.
* కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో నెల్లూరు జిల్లాకు చెందిన మహిళ సూసైడ్ చేసుకుంది. వరికుంటపాడు మండలం, కనియంపాడుకు చెందిన జమీమాగా గుర్తించారు. గత నెలలో జాన్‌బాబును లవ్ మ్యారేజ్ చేసుకుంది. కొద్ది రోజుల క్రితం కోడూరు బీచ్‌లో ఆమె భర్త జాన్ బాబు సూసైడ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి కేజీఎఫ్‌లోని తన బంధువుల వద్ద జమీమా ఉంటోంది.
* కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, గర్శకుర్తికి చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని చిందం మాధవి (23) ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందింది. మాధవి తండ్రి లచ్చయ్య ఇటీవల మరణించాగా.. తల్లి లక్ష్మి మానసికంగా ఇబ్బందులు పడుతోంది. మాధవి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. చదువుకుంటూనే తల్లితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేది. తల్లి లక్ష్మి 15 రోజుల క్రితం నర్సింగాపూర్‌లోని తన పెద్ద కూతురు ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి మాధవి ఒంటరిగా ఉంటుంది.
ప్రతీ రోజూ ఇంటి ముందు తాళం వేసి.. వెనుక నుంచి లోపలకు వెళ్లి గడియ పెట్టి నిద్రించేది. ఆదివారం కూడా అలాగే వెళ్లింది. కానీ, సోమవారం ఉదయం పాలమ్మే వ్యక్తి వచ్చి పిలవగా పలకలేదు. అనుమానం వచ్చి ఇరుగు పొరుగును పిలిచాడు. రోజూ ఇంటి ముందు తాళం వేయగా సోమవారం గడియ పెట్టి ఉన్నట్లు గమనించారు. దాన్ని తీసి లోపలికి వెళ్లి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించింది.