Cricketers earn crores : మన దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ మరో క్రీడకు లేదు. అందుకే క్రికెటర్లకు ఊహించని ఫ్రైజ్ మనీ దక్కుతోంది. ఒక్కో సీజన్ కే కోట్లు వచ్చిపడుతున్నాయి. రిషబ్ పంత్ కు అయితే అత్యధికంగా రూ.27 కోట్లు వేలంలో దక్కింది. అయితే మిగతా క్రీడాంశంలో ఈ స్థాయి డబ్బులు దక్కడం లేదు. వారు ఎంతో దౌర్భాగ్యంలో బతుకుతున్నారు.
ప్రముఖ అథ్లెట్ సీనియర్ రిటైర్ క్రీడాకారుడు సర్వన్ సింగ్ డబ్బులు లేక తాను గెలిచిన గోల్డ్ మెడల్ ను అమ్ముకొని దీనంగా బతుకుతున్న దైన్యం వెలుగుచూసింది. సర్వన్ సింగ్ 110 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొన్న భారత మాజీ అథ్లెట్. 1954లో మనీలాలో జరిగిన ఆసియా క్రీడల్లో అతను బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. గోల్డ్ మెడల్ సాధించినా కూడా ఆయన బతుకు ఇప్పుడు దుర్భరంగా మారింది. నెలకు ₹1,500 పింఛను అందక భిక్షాటన చేస్తున్న దుస్థితి నెలకొంది.
తాజాగా తన బంగారు పథకాన్ని కూడా అమ్ముకొని పొట్టపోసుకుంటున్న దైన్యం కనిపిస్తోంది. మిగతా క్రీడలను కూడా దేశంలో ఆదరించాలని.. వారిని ఈ ఘటన తర్వాత అయినా ప్రోత్సహించాలని అందరూ కోరుతున్నారు.