JAISW News Telugu

Crew Trailer : క్రూ ట్రైలర్ అదిరిపోయే లేడీ ఎంటర్‌టైనర్.. ముగ్గురు స్టార్ హీరోయిన్ల కలయిక అద్భుతం..

FacebookXLinkedinWhatsapp
Crew Trailer

Crew Trailer

Crew Trailer : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘క్రూ’ మూవీకి సంబంధించి ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ వంటి పవర్ హౌస్ త్రయం నటించిన ఈ కామెడీ డ్రామాలో వీరు ముగ్గురు ఎయిర్ హోస్టెస్ లుగా కనిపించనున్నారు.  

ఈ లాంచ్ ఈవెంట్ లో అభిమానులు కృతిని ఆప్యాయంగా పలకరించారు. ఆమె సిగ్గుపడుతూ మరింత అందంగా కనిపించింది. ఎంటర్ టైన్ మెంట్ నేపథ్యంలో సాగిన సినిమాకు సంబంధించి ట్రైలర్ నవ్వులతో నిండింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. దివాలాను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ సవాళ్లను ఎదుర్కొనడం నేపథ్యంలో ముగ్గురు ఎయిర్ హోస్టస్ ఏం చేశారన్నది కథ. నిర్మాతలలో ఒకరైన రియా కపూర్, టబు మరియు కరీనాల ప్రతిభను ప్రశంసిస్తూ, ‘క్రూ’ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని అన్నారు.

ట్రైలర్ ఎలా ఉందంటే..
ఈ ట్రైలర్ విడుదలకు ముందు కరీనా, కృతి అద్భుతమైన గ్లామర్ ను ప్రదర్శించిన ప్రమోషనల్ సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టబూ కూడా తనను తాను ప్రతిఘటించలేదు. ఆశ్చర్యకరమైన ట్విస్టులతో హై ఆక్టేన్ కామెడీ ఉంటుందని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. గోల్డ్ బిస్కెట్ల స్మగ్లింగ్ ఇతివృత్తం, దివాలా తీసే విమానాయాన సంస్థను అందులో నుంచి ఎలా బటయకు తీసుకువస్తారన్న కేంద్రంగా కథ సాగుతుంది. కృతి వలలో పడే కస్టమ్స్ ఆఫీసర్ గా దిల్ జిత్ దోసాంజ్ కనిపించడంతో ట్రైలర్ మొత్తం పాత, కాలం చెల్లిన కథతో నిండిన బోల్డ్ గ్లామర్ లా కనిపించింది.

అదిరిపోయే దుస్తులు, ఆకర్షణీయమైన పాటలు, గర్ల్ పవర్ ను ఆరబోసే సన్నివేశాలు యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రొటీన్ కంటెంట్ అస్సలు క్లిక్ కావడం లేదు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version