Credit Card or Loan : క్రెడిట్ కార్డు.. లోన్ .. ఏది బెటరో తెలుసా?
అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా స్వైప్ చేసి క్యాష్ లోకి కన్వర్ట్ చేసుకోవడం లేదా క్రెడిట్ కార్డు నుంచి అకౌంట్‌లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం లాంటి పనులతో చాలా మంది బోల్తా పడుతుంటారు. ఖరీదైన వస్తువుని ఈఎంఐలో కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులను వినియోగిస్తుంటారు. రూ. లక్ష కంటే పెద్ద అమౌంట్‌లకు క్రెడిట్ కార్డుల కంటే లోను తీసుకోవడమే బెటర్ అని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు బిల్లులను టైంకు కట్టలేకపోతే లేట్ పేమెంట్ ఛార్జీలతో వివిధ రకాల పన్నులు వేసి కస్టమర్ల ప్రాణాలు తీస్తుంటారు. పర్సనల్ లోన్ విషయంలో దీనిపై కొన్ని వెసులు బాట్లు ఉంటాయి. క్రెడిట్ కార్డు విషయంలో అనేక అవకాశాలు ఉంటూనే ఉంటాయి. గత సంవత్సరంతో పోలిస్తే.. క్రెడిట్ కార్డు కంటే లోన్ ఎక్కువగా ఉన్నాయి. కస్టమర్లను ఆకర్షించేం దుకు తక్కవ వడ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు లేని రుణాలను అందిస్తుంటాయి. క్రెడి
కొన్ని ఈఎంఐలు కట్టిన తర్వాత డబ్బు ఉంటే లోన్‌ను ముందే క్లోజ్ చేసేయొచ్చు. చాలా సంస్థలు ఈ ప్రీ క్లోజర్ ఆప్షన్‌ను అందిస్తాయి. క్రెడిట్ కార్డులకు కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. కానీ, క్రెడిట్ కార్డు క్లోజర్‌కు ప్రీ పేమెంట్ పెనాల్టీ ఉంటుంది. పర్సనల్ లోన్స్‌లో ఇలాంటి అవకాశం ఉండదు. క్రెడిట్ కార్డు బిల్లులతో ఇబ్బంది పడేవాళ్లు కడా పెనాల్టీ ఛార్జీలను తగ్గించుకునేందుకు పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతున్నారు. లోన్ అమౌంట్‌తో కార్డు బ్యాలెన్స్ అంతా ఒకేసారి చెల్లించి.. లోన్ అమౌంట్‌ను తక్కువ ఈఎంఐలగా కూడా చెల్లించుకోవచ్చని తెలుసుకోవాలి.తక్కువ మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు, పెద్ద మొత్తాలకు లోన్స్‌ను ఎంచుకుంటే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.