Troll on KCR : కేసీఆర్‌పై క్రియేటివ్ ట్రోల్.. ఏ మహానుభావుడు ఎడిటింగ్ చేశాడో గానీ..

Troll on KCR

Troll on KCR

Troll on KCR : గతంలో ఎన్నికలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగితే.. రాను రాను వైరల్, ట్రోల్స్ లో కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా విస్తృతంగా విస్తరిస్తున్న ఈ జమానాలో దాన్నే ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఎన్నికలు వచ్చిదంటే చాలు సినిమా క్లిప్పింగులు, లేదంటే నాటకాలు, సీరియల్స్ క్లిప్పింగులను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది కాస్తా తెర వైరల్ అవుతుంది. దీన్ని ఒక పార్టీ ట్రోల్స్ కింద తీసుకోగా మరో పార్టీకి హైప్ వస్తుంది. వీటన్నింటిలో హైలట్ విషయం ఏంటంటే.. వీడియోలను మాత్రం బరాబర్ సింగ్ చేస్తున్నారు క్రియేటర్స్..

ఇక్కడ వీడియోలో కేసీఆర్, ఆయన పదేళ్ల పాలనపై క్రియేటివ్ ట్రోల్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని కూడా ఈ పాత్ర వివరిస్తుంది. ‘యమదొంగ’ సినిమాలో ఓ సామాన్యుడికి, యమధర్మరాజుకు మధ్య కీలక సన్నివేశం జరుగుతుంది. మోహన్ బాబు నిజాయితీని ప్రశ్నించే సామాన్యుడిగా ఎన్టీఆర్ నటించారు.

ఈ డైలాగ్ తెలుగు సినిమాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఇది మొదట లెజెండరీ ఎన్టీ రామారావు ప్రధాన పాత్రలో నటించిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలోనిది. ఇప్పుడు ఈ వీడియోను ట్రోల్స్ కోసం వాడుకుంటున్నారు. తెలంగాణలో ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు తదితరుల విజయాలు కేసీఆర్ రాచరిక పాలనకు నిదర్శనమని, రాబోయే ఎన్నికలు టీఆర్ ఎస్ ను పూర్తిగా గద్దె దించుతాయని ఎన్టీఆర్ పాత్ర చెబుతోంది.

లిప్ టు లిప్.. మూవ్ మూవ్.. ఎంతో బాగా సింక్ చేసి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వీడియో బాగానే ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా వీడియో క్రియేట్ చేసిన వాడి టాలెంట్ ను మాత్రం మెచ్చుకోవాల్సిందే.

TAGS