Power Star : ఏడాది కి పైగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏం కొంచెం టైమ్ దొరికిన సినిమాలకే కేటాయించేందుకు సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే మూడు సినిమాలు షూటింగ్స్ నిలిచి పెండింగ్ లో పడ్డాయి. అదే సమయలో నిర్మాతలకు సైతం ఖర్చు పెరుగుతున్నది. దీంతో నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా పెండింగ్ సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు పవన్ కల్యాన్. దీంతో దాదాపు మూడేళ్ల క్రితం షూటింగ్ ప్రారంభమైన హరిహర వీరమల్లు సినిమా సెట్లోకి తిరిగి ఎంటరయ్యాడు. తన వంతు పోర్షన్ చకాచకా కానిచ్చేస్తున్నాడు. ఈ సినిమాను 2025 మార్చిలో రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. హరిహర వీరమల్లు సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది.
ఇక సెట్స్ మీద ఆగిపోయిన మరోరెండు సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అందులో ఒకటి ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) కాగా, మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం తేరికి ఈ సినిమా రీమేక్. ఇందులో పవర్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తు్న్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ పవన్ కల్యాన్ పూర్తి చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు తర్వాత పవన్ కల్యాన్ ముందుగా ఓజీ సినిమా పూర్తి చేస్తాడని సమాచారం. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఓజీలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కూడా ఇందులో విలన్ గా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో పవన్ కల్యాన్ గ్యాంగ్ స్టర్ గా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ ఇందులో నటిస్తున్నాడనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నది. అయితే ఏ పాత్ర చేస్తున్నాడనే విషయం మాత్రం సినిమా టీమ్ గానీ, దర్శకుడు గానీ అధికారికంగా కన్ఫాం చేయలేదు. అలాగని ఖండించలేదు. దీంతో ఈ సినిమాలో దర్శకుడు సుజిత్ పవన్ కల్యాన్ తో కలిసి నటించబోతున్నాడనే న్యూస్ మాత్రం వైరల్ అవుతున్నది.