Cranbury High School : క్రాన్ బరీ హై స్కూల్ లో భారీగా ‘వసంతం’.. కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమాలు

Cranbury High School
Cranbury High School : ‘VT సేవ’ (వలంటిరింగ్ టుగెదర్ ఫర్ సర్వీస్) న్యూజెర్సీలో వార్షిక నృత్య, సంగీత ప్రదర్శనను ‘వసంతం’ పేరుతో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నృత్య, సంగీత పాఠశాలల విద్యార్థులను ఆహ్వనించింది. అయితే దీనిని రిజిస్ట్రేషన్ రుసుం తీసుకున్నట్లు చెప్పిన సంస్థ ఈ సుముతో పాటు వసంతం ద్వారా వచ్చిన ఆదాయంను దృష్టి లోపం ఉన్న, వెనుకబడిన విద్యార్థుల విద్య కోసం వెచ్చిస్తామని తెలిపారు.
తేదీ: నవంబర్ 18, 2023 (శనివారం)
సమయాలు: సాయంత్ర 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది.
వేదిక: క్రాన్బరీ హై స్కూల్ ఆడిటోరియం, 23 N మెయిన్ సెయింట్, క్రాన్బెర్రీ, NJ, 08512
ఇతర: కార్యక్రమంలో స్నాక్స్ కూడా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.
‘VT సేవ’ అనేది సామాజిక, ఆర్థిక వ్యవస్థలో వెనుకబడిన వారి అభివృద్ధి కోసం పని చేస్తుంది. దీంతో పాటు దివ్యాంగులైన (గుడ్డి) వారి కోసం పని చేస్తుంది. పేద, అంధ విద్యార్థులకు విద్యనందించేందుకు, సాధికారత కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా సంస్థ సేవలను అందిస్తుంది.
వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా సంభవించే ప్రకృతి విపత్తు, క్యాన్సర్ పై అవగాహన, తక్షణ ప్రతిస్పందనను ప్రోత్సహించడంలో సంస్థ చురుకుగా పాల్గొంటుంది. జాతీయ కార్యకలాపాలతో పాటు, న్యూజెర్సీ చాప్టర్ యువతలో వారి భాగస్వామ్యం, నాయకత్వ నైపుణ్యాల కోసం స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని ప్రోత్సహించడానికి కార్యకలాపాలను నిర్వహిస్తుంది.