Taj Mahal : పగుళ్లు పెచ్చులు.. తాజ్ మహల్ కులబోతోందా?
Taj Mahal Cracks : 1648 లో ప్రారంభమైన తాజ్ మహల్ శతాబ్ధాలుగా చెక్కు చెదరకుండా ఉంటూ వస్తోంది. గతంలో తాజ్ మహల్ ఎదుట ఉన్న యమునా నది నుంచి కాలుష్యం పారుతుందని, ఇది తాజ్ మహల్ కు చేటు చేస్తుందని గ్రహించిన అధికారులు వేగంగా నదిని శుభ్రం చేశారు. వాయు కాలుష్యం పెరిగిపోయి. తాజ్ మహల్ కు తీవ్రమైన చేటు చేస్తుంది. ఎంతలా అంటే కిటికీలు, గోడలు ఇలా పెద్ద పెద్ద పగుళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజ్ మహల్ ను చూస్తున్న వారందరూ ప్రేమ సౌధానికి బీటలు వారడంతో కన్నీరు పెడుతున్నారు. ఇలాంటి నిర్మాణం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇంత గొప్ప నిర్మాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలుష్యం కాటుకు బలవ్వాల్సిందేనా? అని ఆవేదన చెందుతున్నారు.
తాజ్ మహల్ ప్రేమకు గుర్తు. ముంతాజ్ సమాధి ఉన్న గోడలు కూడా అక్కడక్కడా బీటలు వారి కనిపిస్తున్నాయి. డూమ్ పైన అందం కోసం ఉన్న నగిషీలు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి. రంగు రంగుల రాళ్లు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. తాజ్ మహల్ మరికొన్ని దశాబ్ధాల్లో కాల గర్భంలో కలిసిపోతుందా? అన్న అనుమానాలు చాలా మందికి కాలుగుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు ఎంత మరమ్మతులు నిర్వహించినా నిర్మించినంత అందంగా ఉంచలేదు కదా..? ఎప్పుడో ఒకప్పుడు కాల గర్భంలో కలిసి పోతుందని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
View this post on Instagram