Anchor Anasuya : కౌ గర్ల్ అనసూయ.. చూస్తే తట్టుకోలేరంతే.. వైరల్ పిక్స్

Cow Girl Anasuya Viral Pics
Anchor Anasuya : అందమైన సొగసు, ఆకట్టుకునే మాట, పొడవాటి సౌష్టవం కలిస్తే యాంకర్ అనసూయ భరద్వాజ్. న్యూస్ ఛానల్ తో మొదలైన ఆమె కెరీర్ ప్రస్తుతం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఆమె కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పిన షో జబర్ధస్త్, ఈ షోతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. కేవలం అనసూయను చూసేందుకు చాలా మంది గురువారం వరకు వేచి చూసే వారు. ఆ తర్వాత షోకు రేటింగ్ పెరగడంతో ఎక్స్ ట్రా తీసుకువచ్చారు అది వేరే విషయం. కానీ జబర్ధస్త్ కు ఆదరణ, అనసూయకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ఆ తర్వాత అమ్మడు సినిమాల వైపు దృష్టి పెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రాధాన్యమున్న పాత్రలు వేస్తూ అభిమానుల మన్ననలు పొందారు. ఇక సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆరోపణలు, ట్రోల్స్ ఎదుర్కొన్నా ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రధానంగా విజయ్ దేవరకొండ, ఆయన ఫ్యాన్స్ తో విపరీతమైన ట్రోల్స్ కు గురయ్యారు అనసూయ. ఇక ఈ గొడవకు ఎప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకొని ఆమే విజయ్ కి తనకు ఎలాంటి గొడవలు లేవని, కెరీర్ పరంగా కలిసే పని చేస్తామని చెప్పి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు.
ఇక ఆమె ఇన్ స్టాను ఫాలో అయితే.. హాట్ హాట్ పిక్స్ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ తన అభిమానులకు మరింత ఆనందం పంచడంలో అనసూయ ముందే ఉంటుంది. ఇందులో భాగంగానే రీసెంట్ గా కౌగర్ల్ గా కనిపించింది. తలపై హ్యాట్ బ్లా కలర్ డ్రెస్ తో అదరగొట్టింది. ఈ పిక్స్ చూసిన వారు కౌగర్ల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనసూయ తన అభిమానులకు ఆనందం పంచుతూనే ఉంటుందని ఒప్పుకోక తప్పదు మరి.