Covid Infection : అమ్మో..ఆ వ్యక్తి శరీరంలో 613 రోజులు కొవిడ్ తిష్ఠ!

Covid Infection

Covid Infection

Covid Infection : కొవిడ్ ఎంతలా భయపెట్టిందో తెలిసిందే. దాని బారిన పడిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ బయటపడ్డారు. వైరస్ అంత తీవ్రస్థాయిలో భయపెట్టింది. ప్రపంచమే అతలాకుతలం అయింది. ఈనేపథ్యంలో నెదర్లాండ్ కు చెందిన ఓ వృద్ధుడు 613 రోజుల పాటు కొవిడ్ బారిన పడ్డాడంటే అతడు ఎంత వేదన అనుభవించాడో అర్థమవుతుంది.

ఒక వ్యక్తి శరీరంలో వైరస్ అత్యధిక కాలం ఉన్న ఘటన ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. గత ఏడాది అతడు చనిపోయే సమయానికి అతడిలో దాదాపు 50సార్లు వైరస్ మ్యుటేషన్ అయ్యిందట. బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్న వారిని వైరస్ లు ఆవాసాలుగా చేసుకుంటాయని చెబుతున్నారు. ఇలా వైరస్ అతడి శరీరంలో ఎక్కువ కాలం నిలిచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వైరస్ అతడి శరీరంలో తిష్ఠవేసిందని అంటున్నారు.

ఇలాంటి వ్యక్తుల శరీరంలో వైరస్ లు అలాగే ఉండిపోయి వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఒక వ్యక్తి శరీరంలో 613 రోజులు వైరస్ తిష్ఠవేసిందంటే అతడి శరీరం ఎంత బలహీనమైందో తెలుస్తోంది. దీని వల్ల అతడు దాదాపు రెండు సంవత్సరాల పాటు వైరస్ ధాటికి బాధ పడినట్లు అర్థమవుతోంది.

వృద్ధులు ఆరోగ్య సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవాలి. ఆ దిశగా మనం అడుగులు వేయాలి. ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. దీంతో వయోభారంతో బాధపడేవారు జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తలెత్తడం ఖాయం అంటున్నారు.

కొవిడ్ వైరస్ వల్ల ఎంతో మంది బాధపడ్డారు. దాని ధాటికి ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్లు కొవిడ్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఈనేపథ్యంలో అలాంటి వైరస్ మళ్లీ రాకూడదని కోరుకుంటారు. అలాంటి వైరస్ రాకుండా చూసుకోవడమే మన బాధ్యతగా గుర్తించాలి.

TAGS