China visa case : చైనా వీసా కేసులో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్, ఆయుధాల వ్యాపారి అభిషేక్ వర్మలను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో వారికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో వీరిద్దర్ని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కాంగ్రెస్ నేత లెటర్ హెడ్ తో నకిలీ లేఖను సృష్టించినట్లు నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఓ చైనా టెలికాం కంపెనీ అధికారుకలు వీసా నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని అభ్యర్థిస్తూ అప్పటి పీఎం మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ నేత లేఖ రాసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఫోర్జరీ లెటర్ హెడ్ ఉపయోగించారని పేర్కొంటూ నాటి హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మాకెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జగదీష్ టైట్లర్, అభిషేక్ వర్మలపై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.