Johnny Master case : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కోర్టు కీలక నిర్ణయం

Johnny Master case

Johnny Master case

Johnny Master case : తన అసిస్టెంట్  పై లైంగిక దాడికి పాల్పడ్డాడని నమోదైన కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ఇటీవల నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  పోలీసులు జానీ మాస్టర్ ను కోర్టులో రిమాండ్ చేసి,  కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. అతడిని నాలుగు రోజులపాటు లోతుగా విచారించిన పోలీసులు అతడి నుంచి పలు కీలక అంశాలను రాబట్టారు. అనంతరం పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకోవాల్సి ఉందని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల జానీ మాస్టర్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవార్డు దష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జానీ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 7 కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. నార్సింగి పోలీసులు కూడా జానీ మాస్టర్ పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ ఇస్తే నిందితుడు సాక్షులను ప్రభావితం చేసే ఆస్కారం ఉందని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టుకు వివరించారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించారు పోలీసులు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల7కు వాయిదా వేసింది.

మధ్యంతర బెయిల్ మంజూరు..

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 10 వరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్‌ నుంచి పలు కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తున్నది.

TAGS