CM Stalin : దంపతులు తమ పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి: సీఎం స్టాలిన్
CM Stalin : దంపతులు తమ పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే థౌజండ్ లైట్స్ తూర్పు కార్యదర్శి అన్బుదురై ఇంటి వివాహ కార్యక్రమం చెన్నై నగరంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్ తన సతీమణి దుర్గతో కలిసి హాజరయ్యారు. తన చేతుల మీదుగా వరుడికి మంగళసూత్రాన్ని అందించారు. వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ విప్లవ రచయిత పావేందర్ భారతిదాసన్ చెప్పినట్లు ఇంటికి దీపంగా, దేశానికి కార్యకర్తలుగా ఉండి సేవలు అందించాలని తెలిపారు. నూతన జంట తమకు పుట్టే పిల్లలకు అందమైన తమిళపేర్లు పెట్టాలని, తమిళ భాషకువన్నె తీసుకురావాలని పిలుపునిచ్చారు. అన్బుదురై పార్టీకి చేసిన కృషి, పార్టీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగిన వైనం వివరించారు.