World Best Leader Modi : తల్లి తనను విడిచిపోయిందన్న ధు:ఖాన్ని భరిస్తూ స్వల్పకాలంలోనే కర్మఖాండ పూర్తి చేసి విధులకు వెళ్లిన గొప్ప నేత మోడీ. ఇటు వంటి ప్రధాని ఇంతకుముందు లేడు.. ఇక ముందు వస్తారని నమ్మకం కూడా లేదు.. తన తల్లి కంటే కూడా దేశ సౌభాగ్యమే మిన్న అని ఆలోచించిన గొప్ప వ్యక్తి మోడీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాల్యం నుంచి తన తల్లి ఆశీర్వాదం, భారత మాతపై ప్రేమ, భక్తి కలిసి మోడీని అంత గొప్ప నాయకుడిగా నిలబెట్టాయి. మోడీ ఒక యోగి. తల్లి తనకు దూరమైన ధు:ఖాన్ని దిగ మింగుకొని మరీ దేశం కోసం పని చేసిన గొప్ప నాయకుడు. తల్లి చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి దేశ సౌభాగ్యం కోసం శ్రమిస్తున్న నేత.
మోడీ గురించి ఒక్క మాటలో చెప్పడం అసాధ్యం. దేశం కోసం, దేశ ప్రజల కోసమే తల్లి హీరాబెన్ ఆయనను కన్నది. మోడీ కుటుంబం పెద్దది. మోడీ మాత్రమే కాదు. ఆయనకు సోదరులు, సోదరీ మణులు ఉన్నారు. కానీ మోడీ తన తల్లి వద్దనే ఉన్నాడు. అధికారిక కార్యక్రమాలు లేని సమయంలో ఎక్కువగా తన తల్లితోనే గడిపేవాడు మోడీ.
మోడీ తల్లి హీరాబెన్ స్వర్గస్తురాలైన సమయంలో మోడీ కన్నీటి పర్యంతమయ్యారు. తనను ప్రేమగా చూసుకునే ఒక్కగానొక్క తల్లి దూరం కావడంతో తట్టుకోలేకపోయారు. కానీ ప్రతీ ఒక్కరికీ మరణం తప్పదు కదా.. దాదాపు 90 ఏళ్లకు పైగా జీవించిన తన తల్లి లోకాన్ని విడిచి వెళ్లినా తనతోనే ఉంటుందని భావించారు మోడీ. అంతిమ సంస్కారాలను సాదాసీదాగా నిర్వహించారు.
తాను ఒక తల్లికి కొడుకు మాత్రమే కాదు.. దేశానికి ప్రధాని కూడా. తల్లి మరణించడంతో కన్నీటిని పంటిపై బిగబట్టి మోడీ తల్లి కర్మఖాండ పూర్తి కాగానే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ రోజు (డిసెంబర్ 30, 2023) కోల్కత్తాలో వందే భారత్ రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో ముఖ్యమైన సమావేశంలో కూడా పాల్గొన్నారు. తల్లి లేదన్న ధు:ఖం నెలల తరబడి వెంటాడుతూనే ఉన్నా.. దేశంలోని ప్రతీ కార్యక్రమంలో పాల్గొన్నారు మోడీ. ఇప్పటికీ తన తల్లి చిత్ర పటాలను చూసి మురిపోయే కొడుకుగా కనిపిస్తారు ఆయన.
తల్లి చనిపోతే మన సంప్రదాయం ప్రకారం కొందరు 11 రోజులు ఇంటి నుంచి అడుగు కూడా బయటపెట్టం. ఇంకొందరు నెల మాషికం పెట్టందే శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరు. కానీ మోడీ మాత్రం తల్లి కట్టె కాలకముందే దేశ దేశ సేవకు వెళ్లిపోయారు. అధికారిక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. తన తల్లే కాదు.. దేశంలోని 140 కోట్ల మంది తనకు తల్లిదండ్రులే అని వారి కోసం పనిచేస్తానంటూ దేశ సేవకు అంకితమైన గొప్ప వ్యక్తి మోడీ.. అందుకే మోడీ అంటే ఒక భక్తి.. మోడీ అంటే ఒక శక్తి.. అంతిమంగా అతడిని మించిన దేశభక్తుడు ఈ ప్రపంచంలోనే లేడు అనడంలో ఎలాంటి సందేహం లేదు..
By..
—–
-Dr. Jai, Jagadeesh Babu Yalamanchili
Honorable Global Advisor for JSW TV and Jai Swaraajya World TV Global Digital Media
UBlood Founder.