India Border Countries : ఇండియాతో సరిహద్దులు పంచుకునే దేశాలు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాకిస్థాన్ ఇండియా నుంచి విడిపోవడంతో పాటు 1975 లో యుద్దం తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. దీంతో ఈ దేశం కూడా ఇండియాతో సరిహద్దులు కలిగిన దేశంగా మారింది.
బంగ్లాదేశ్ ఇండియాతో 4096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దు భూభాగాలు ఉంటాయి. భూటాన్ 578 కిలోమీటర్లు, చైనా 3448 కిలోమీటర్లు, మయన్మార్ 1643 కిలోమీటర్లు, నేపాల్ 1752 కిలోమీటర్ల భూభాగాలు సరిహద్దులుగా ఉన్నాయి. పాకిస్థాన్ తో 3310 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా.. పాక్ తో కాశ్మీర్ వివాదం కారణంగా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేకుండా పోయాయి. పాక్, భారత్ రెండు శత్రు దేశాలుగా మారిపోయాయి. ఆప్ఘనిస్తాన్ తో అతి తక్కువ భూభాగంలో సరిహద్దు ఉంది. కేవలం 106 కిలోమీటర్ల వరకే ఉంది.
వాఘా సరిహద్దు వద్ద పాక్, భారత్ సైన్యం ప్రతి రోజూ విన్యాసాలు చేస్తుంటాయి. బీటింగ్ రిట్రీట్ కు ఎక్కువ మంది హాజరై ఆ కార్యక్రమాన్ని చూసి ఉద్వేగానికి గురవుతుంటారు. రోజూ సాయంత్రం ఆరు గంటలకు ఇది జరుగుతుంటుంది. భారత్, చైనా అయిదు బోర్డర్ పాయింట్లు కలిగి ఉంది. భారత్ అంతర్జాతీయ సరిహద్దు రేఖ పొడువు మొత్తం 15 వేల కిలోమీటర్లు ఉంటుంది. 7 దేశాలతో సరిహద్దు భూభాగాలు ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్ లోని కొంత భూభాగం పాక్, భారత్ ఇరు దేశాల నియంత్రణలో ఉంటుంది. అందులో భాగంగా 1972 లో దీన్ని ఎల్ వోసీ గా మార్చారు. నియంత్రణ రేఖ అని పిలుస్తారు. భారత్ చైనా మధ్య కాల్పుల విరమణ జరగ్గా డ్రాగన్ కంట్రీతో పంచుకునే సరిహద్దు కొంత భాగాన్ని వాస్తవ నియంత్రణ రేఖ అంటారు. డ్యూరాండ్ లైన్ ఇండియా, ఆప్ఘనిస్తాన్ లను వేరు చేస్తుంది. ఇలా ఒక్కో దేశంతో ఒక్కో ప్రదేశం వద్ద నియంత్రణ రేఖలు ఉన్నాయి.