Sobhita : శోభితకు కౌంట్ డౌన్ మొదలు.. సమంత షాకింగ్ కామెంట్స్..

Sobhita : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ ఆగస్ట్ 8వ తేదీన ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరికి సంబంధించి ఫొటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో విషయం నాలుగురి మధ్యలోకి వచ్చింది.

అయితే ఎవ్వరూ ఉహించని విధంగా శోభిత ఎంటరవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి ఎంగేజ్ మెంట్ వార్త విని అందరూ ఖంగు తిన్నారు. కొంత కాలంగా సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. పెళ్లి పనుల్లో భాగంగా ఇటీవల పసుపు దంచే ఫొటోలను శోభిత రిలీజ్ చేసింది. ప్రత్యేక పూజలు, పెద్దల ఆశీర్వాదాలతో పెళ్లి తంతు మొదలైందనట్లు కనిపించింది. కానీ వివాహ తేదీ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

ఇదిలా ఉంటే.. శోభిత చెల్లెలు డాక్టర్. సమంత ఇన్ స్టా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘ది కౌంట్ డౌన్ బిగెన్’ అనే క్యాప్షన్ యాడ్ చేసింది. అక్క శోభిత, తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోలను తన ఇన్ ఇన్ స్టాలో షేర్ చేసింది.

ఈ పిక్స్‌లో అక్కినేని ఇంటికి కాబోయే కోడలు ఇంటికి కాబోయే కోడలు శోభిత పండితుల ఆశీర్వాదం తీసుకుంటూ, పెళ్లి కూతురు బొమ్మ చూస్తూ కనిపించింది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కినేని అభిమానులు పెళ్లి డేట్ అనౌన్స్ చేయండి అని కోరుతున్నారు. కొందరు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ శోభిత అందాన్ని పొగుడుతున్నారు.
TAGS Actress Sobhita DhulipalaNaga Chaitanya and SobhitaSamanthaSobhitaSobhita MarriageSobhita Wedding