Ratan Tata : కార్పొరేట్ కూలీ రతన్ టాటా.. ఉప్పు నుంచి షిప్పుల దాకా వ్యాపారం!
హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఉన్నత విద్య
ముంబై, సిమ్లాలో చదివిన తరువాత రతన్ టాటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత అతను కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు. రతన్ టాటా అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నాడు. కానీ అమ్మమ్మ ఆరోగ్యం దృష్ట్యా టాటా తిరిగి ఇండియాకు రావాల్సి వచ్చింది. తర్వాత భారతదేశంలో ఐబీఎం కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఈ విషయం తెలియగానే టాటా గ్రూప్ చైర్మన్ జేఆర్డీ టాటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఆర్డీ టాటా కోరిక మేరకు, అతను తన సీవీని టాటా గ్రూప్‌కు పంపాడు. టాటా గ్రూప్‌లో సాధారణ ఉద్యోగిగా తన ఉద్యోగిగా ప్రారంభించాడు.
టాటా స్టీల్‌లో కూలీల్లా పనిచేశారు
టాటా గ్రూప్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో, అతను ఇతర ఉద్యోగులతో కలిసి పనిలో మెలకువలను నేర్చుకున్నాడు. టాటా స్టీల్ ప్లాంట్‌లో ఫర్నేస్‌లలో సున్నపురాయి వేసే విభఆగంలో కూడా పనిచేశాడు. ఇది సాధారణంగా కూలీలు చేసేది. 1991 సంవత్సరంలో, రతన్ టాటా టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా ఉన్నారు. మొత్తం గ్రూప్‌నకు సుమారు 21 ఏళ్ల పాటు నాయకత్వం వహించారు. ఈ కాలంలో, రతన్ టాటా తమ టాటా గ్రూప్‌ను చిరస్మరణీయంగా నడిపించడమే కాకుండా పరిశ్రమలో భారతదేశానికి కీర్తిని తెచ్చారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రతన్ టాటా జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి పెద్ద బ్రాండ్‌లను చేజిక్కించుకున్నారు.
ప్రతి ఇంట్లో టాటా
రతన్ టాటా.. ఉప్పు తయారీ నుండి ఎగిరే విమానాల వరకు తన వ్యాపారాలను విస్తరించారు. రతన్ టాటా కారణంగానే ఈ రోజు భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో టాటా ఉత్పత్తి కనిపిస్తుంటుంది. రతన్ టాటా అటువంటి ఉత్పత్తులను దేశానికి అందించారు, వీటిని భారతదేశంలోని ఉన్నత తరగతి నుంచి దిగువ తరగతి వరకు అందరూ ఉపయోగిస్తున్నారు.