Uttam Kumar : ఉత్తమ్ ను కార్నర్ చేస్తున్న నేతలు.. రూ.1100కోట్ల స్కామ్ ఆరోపణలు

Uttam Kumar

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : పౌర సరఫరాల శాఖలో భారీ స్కాం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 50రోజుల్లోనే రూ.1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 35లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలవడం వెనుక భారీ కుంభకోణం దాగుందన్నారు. ధాన్యానికి రూ.2,232 చెల్లించాలని మిల్లర్లను బ్లాక్ మెయిల్‌ చేస్తున్నారంటూ ఆరోపించారు.  మనీ ల్యాండరింగ్ ద్వారా మిల్లర్ల నుంచి 700 కోట్లు వసూలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  పాల్పడిన అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను సోమవారం బయటపెడతానని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. యూ ట్యాక్స్ అంటూ మహేశ్వర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే కేటీఆర్ సైతం ఇది 1100కోట్ల స్కామ్ అని ఆరోపించడం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి సోమవారం ఎలాంటి ఆధారాలు బయటపెడుతారు అనేది ఉత్కంఠగా మారింది.

పౌరసరఫరాల శాఖలో అవకతవకలు జరిగాయని, వందల కోట్ల కుంభకోణం జరిగిందనేది వాస్తవమని మహేశ్వర్ రెడ్డి బల్లగుద్ది చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉండగా బ్లాక్ లిస్టులో పెట్టిన కేంద్రీయ భండార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జేబులు నింపుకోవడానికేనని కేటీఆర్ ఆరోపించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఉత్తమ్ ను కార్నర్ చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు బయటపెడుతానని మహేశ్వర్ రెడ్డి ప్రకటించడం నేడు ఆయన వెల్లడించబోయే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

దీంతో మంత్రి ఉత్తమ్ అవినీతికి పాల్పడ్డారా..? లేదంటే సివిల్ సప్లై అధికారులే ఉత్తమ్ కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా అవినీతి చేశారా.. లేక ఉత్తమ్ లక్ష్యంగా ఏమైనా సీక్రెట్ ఆపరేషన్ నడుస్తుందా..? ఒకవేళ కుంభకోణం జరిగినా అందుకు సంబంధించిన వివరాలను బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు చేరవేసింది ఎవరనే అంశాలపై చర్చ జరుగుతోంది.

TAGS