Minister Nadendla : నేటి నుంచి రేషన్ కార్డుపై వంటనూనెలు : మంత్రి నాదెండ్ల
Minister Nadendla : రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో శుక్రవారం నుంచి నెలాఖరు వరకు పామోలిన్ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలకు అందించనున్నట్లు వెల్లడించారు. నిన్న (గురువారం) విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేసశంలో ఆయన ధరల నియంత్రణపై చర్చించారు. ఇండోనేషియా, మలేసియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజీ ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు వివరించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు కాకుండా రాష్ట్రమంతటా ఒకే ధరపై విక్రయించాలని మంత్రి మనోహర్ సూచించారు.