Controversy meme :బ్రెజిల్‌లోని రియో డీ జనీరోలో జరుగుతున్న G20 సమ్మిట్‌లో భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటాలియన్ కౌంటర్ జార్జియా మెలోనీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం ముఖ్యమైన సామర్థ్యాన్ని గుర్తించారు. సోమవారం జరిగిన వారి ద్వైపాక్షిక సమావేశంలో, ఇరువురు నేతలు తమ సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు అంగీకరించారు. ఇటాలియన్ కౌంటర్ జార్జియా మెలోనితో ప్రధాని మోదీ జరిపిన చర్చలు న్యూఢిల్లీ, రోమ్ మధ్య ముఖ్యమైన రంగాలలో భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి సారించాయి. ‘
రియో డీ జెనీరో G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి జార్జియా మెలోనిని కలుసుకున్నందుకు సంతోషిస్తున్నాము. రక్షణ, భద్రత, వాణిజ్యం. సాంకేతికత రంగాల్లో సంబంధాలను పెంచుకోవడంపై మా చర్చలు జరిగాయని, సంస్కృతి, విద్య, ఇతర రంగాలలో సహకారాన్ని ఎలా పెంచుకోవాలో మాట్లాడాం. భారతదేశం-ఇటలీ మధ్య స్నేహం మరింత పటిష్టం అవుతుంది’ అని ప్రధాని వివరించారు. వీరి సమావేశంలో పాల్గొన్న పిక్ ను ఎడిట్ చేసిన వైరల్ రాయుళ్లు ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. మెలోని, మోడీ ఫొటోలు ఎదురెదురుగా ఉంచారు. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ లవర్స్ లాగా కనిపించారని కొందరు కామెంట్లు పెడుతున్నారు. దూరంగా కూర్చున్న వాళ్లు పరిస్థితులకు తగ్గట్లు హావభావాలు పెడితే వాటిపై భిన్నమైన కామెంట్లు వచ్చాయి. ఇద్దరు లవర్స్ అని కూడా కొందరు కమెంట్లు పెట్టడంపై కొంత నవ్వు తెప్పిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి మీమ్స్ తో జాగ్రత్తగా ఉండాలి.