Panchamrita : పంచామృతంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. దర్శకుడి అరెస్టు

Panchamrita Comments Director arrest
Panchamrita : తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ.. పళని పంచామృతంలో గర్భ నిరోధక మాత్రలు కలుపుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ దర్శకుడు జి.మోహన్ ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. చెన్నై రాయపురంలోని నివాసంలో ఆయనను అరెస్టు చేసిన తిరుచ్చి జిల్లా సైబర్ క్రైం పోలీసులు తిరుచ్చి తరలించారు. కాగా, తమిళ స్టార్ నటుడు విజయ్ పైనా మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పజయ వన్నారపట్టైతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన మోహన్ తాండవం, రుద్రతాండవం, ద్రౌపది వంటి సినిమాలు తీశారు. ఇటీవల దర్శకుడు సెల్వరాఘవన్ కథానాయకుడిగా మోహన్ దర్శకత్వంలో వచ్చిన బకాసురన్ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.