Tungabhadra project : తుంగభద్ర ప్రాజెక్టులోకి స్థిరంగా వరద ప్రవాహం

Tungabhadra project : తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో జలాశయానికి గురువారం 97,751 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 1631.94 అడుగులకు గాను 101.54 టీఎంసీల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. జలాశయం నుంచి వివిధ కాల్వలతో పాటు దాదాపు 20 గేట్లు తెరిచి నదికి కలిపి 96,487 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిన్న (బుధవారం) సాయంత్రం ఆయా గ్రామాల్లో వర్షాలు కురిసిన నేపథ్యంలో వివిధ గ్రామాల్లో పొగమంచు అలుముకుంది. గురువారం ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల వరకు మంచు అలుముకోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన దారుల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు, మనుషులు సరిగా కనిపించక పోవడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. ఈ పొగమంచు వల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

TAGS