Constable Suicide : పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable Suicide
Constable Suicide : ఏపీలోని శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ శంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పీఎస్ విశ్రాంతి గదిలోనే శంకర్ రెడ్డి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు రక్ప మడుగులో పడి ఉన్న ఘటనను పోలీసులు గుర్తించారు.ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
సమాచారం అందుకున్న సీఐ ప్రసాదరావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు అక్కడికి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 2001లో సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరిన శంకర్ రెడ్డి, కర్నూలు, పెద్దకడుబూరు, శ్రీశైలం పోలీస్ స్టేషన్ లలో పని చేశారు.