Pawan Helicopter Journey : పవన్ హెలికాప్టర్ ప్రయాణాన్ని అడ్డకునేందుకు కుట్ర
- టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

Pawan Helicopter Journey CBN Comments
Pawan Helicopter Journey : జనసేన పార్టీ అధినేత పవన్ హెలికాప్టర్ ప్రయాణాన్ని అడ్డకునేందుకు వైయస్ జగన్ కుట్ర చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు కలిసి ఒక్కటిగా ప్రజల్లోకి వెళ్తుంటే వైఎస్సార్ పార్టీ నాయకుల్లో, ముఖ్యంగా జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రాజకీచ దురుద్దేశంతో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ప్రయాణాన్ని అడుకుంటున్నారని అన్నారు. అంబాజీపేట, అమలాపురంలలో నిర్వహించే సభలకు పవన్ వెళ్లకుండా రాజమండ్రి నుంచి వెళ్లే హెలికాప్టర్ కు సాంకేతిక కారణాలను సాకుగా చూపారని తెలిపారు. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేస్తున్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని చంద్రబాబు సూచించారు.
రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి అంబాజీపేట సభకు పవన్ కళ్యాణ్ వెళ్లాల్సి ఉండగా హెలికాప్టర్ తో వచ్చిన కో-పైలెట్ కు హెలికాప్టర్ తీసుకెళ్లేందుకు ఎయిర్ పోర్టు ఎంట్రీ పర్మిట్ లేదనే సాకుచూపి ఆపేశారని తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే తన హెలికాప్టర్ కో-పైలెట్ సాయంతో ఆలస్యంగా సాయంత్రం కోనసీమ చేరుకున్నారని తెలిపారు. కో-పైలెట్ కు బేగంపేటలో ఇచ్చినట్లే తాత్కాలిక పాస్ ఇవ్వాలని కోరినా.. నిబంధనల ప్రకారం సాధ్యం కాదని చెప్పారని, బేగంపేటలో లేని ఇబ్బంది రాజమండ్రిలో ఎందుకు అని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేదని అన్నారు.
అంబాజీపేట హెలిప్యాడ్ వద్ద కోడికత్తి కేసు బాధితుడు జనిపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో వచ్చి చంద్రబాబును కలిసి తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నాడు.