KTR : ఎన్నికల్లో ప్రతీ పార్టీ ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయడం కామనే.. కానీ అందులో మంచివి ఉంటాయి.. చెడ్డవి ఉంటాయి.. ఇందులో కథలు కూడా ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయం అంటూ సర్వేలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలక, ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంటుంది. ఒక వేళ కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది. అనే దానిపై మంత్రి కేటీఆర్ ఒక డిబేట్ లో కథ చెప్పారు. ఈ కథ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.
పాపులర్ టెలివిజన్ సంస్థ టీవీ9 మంత్రి కేటీఆర్ తో కలిసి ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇందులో వివిధ రాంగాలకు సబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు. వారి అనుమానాలను కేటీఆర్ నివృత్తి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ నిపుణుడు ఒక ప్రశ్న వేశాడు. ‘కాంగ్రెస్ వస్తే ఏమవుతుందని’ దీనికి కేటీఆర్ బదులిచ్చాడు.
కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనం అవుతుందని కేటీఆర్ చెప్పాడు. దీంతో ప్రోగ్రామ్ హోస్ట్ ఎందుకని? ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కుర్చీల కుమ్ములాటలతో ఉంటుంది. ఒకరి నుంచి కుర్చీ మరొకరు లాక్కోవాలనే చూస్తారు. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్లాలి. కనీసం బీ ఫామ్ లు సొంతంగా ఇచ్చుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ది. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత బెంగళూర్ రియల్ ఎస్టేట్ రంగంలో పూర్తిగా నాశనం అయ్యింది. బెంగళూర్ పూర్తిగా నాశనమై పోయిందని, హైదరాబాద్ బాగా ఎదిగిందని రిపోర్టులు చెప్తున్నాయన్నాడు.
కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది – మంత్రి కేటీఆర్ pic.twitter.com/3Q28wnYtDf
— Telugu Scribe (@TeluguScribe) November 23, 2023