Congress MLA : సుచిత్ర సెంటర్ లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాను పోలీసులు అనుమతించలేదు. సర్వే అనంతరం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సర్వే రిపోర్టు వచ్చేందుకు ఒకరోజు సమయం పట్టనుంది.
మరోవైపు ఈ భూ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్క్షణ్ స్పందించారు. 2015లో 82/e సర్వే నెంబర్ లో వేరే వ్యక్తి దగ్గర నుంచి కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు. తనతో మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని, ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే భూమి కొనుగోలు చేశామన్నారు. 15 మంది వ్యక్తుల్లో ఆయన కూడ ఒకరని తెలిపారు. మల్లారెడ్డి ఈ ల్యాండ్ వివాదంపై పలుమార్లు మాట్లాడాము. సర్వే కోసం రమ్మని పిలిచినా రాలేదు. తనకు సర్వే అవసరం లేదని చెప్పారని, ల్యాండ్ పై ఇంజెక్షన్ ఆర్డర్ వేసినా దానికి కౌంటర్ కూడా వేయలేదని వివరించారు. మల్లారెడ్డి తన పేరు ప్రస్తావించినందున మీడియాతో మాట్లాడవలసి వచ్చిందని వెల్లడించారు.