JAISW News Telugu

Telangana Election Result:పోస్ట‌ల్ బ్యాలెట్‌ల‌లో కాంగ్రెస్ ముందంజ‌

Telangana Election Result: తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు తీవ్ర ఉత్కంఠ‌త‌ను రేపుతున్నాయి. ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం అయింది. ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ముందుగా పోస్ట‌ల్, స‌ర్వీసు ఓట్ల లెక్కింపు ప్రారఃభించ‌గా ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ముందంజ‌లో ఉండటం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అధికార పార్టీ బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌తో పోలిస్తే కాంగ్రెస్ అభ్య‌ర్థులు అత్య‌ధికంగా లీడింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఖ‌మ్మం లోని 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు ముందంజ‌లో కొన‌సాగుతున్నారు. ఒక చోట సీపీఎం అభ్య‌ర్థి లీడింగ్‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌ల లెక్కింపులో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌, భాజాపా అభ్య‌ర్థుల వివ‌రాలివి.

ములుగు: సీత‌క్క (కాంగ్రెస్‌)
కామారెడ్డి: రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌)
గోషామ‌హాల్: రాజాసింగ్ (బీజేపీ)
ప‌రిగి : రామ్మోహ‌న్ రెడ్డి (కాంగ్రెస్‌)
వైరా: మాలోతు రాందాస్ (కాంగ్రెస్‌)
ప‌ర‌కాల: రేవూరి ప్ర‌కాష్ రెడ్డి (కాంగ్రెస్‌)
పాలేరు: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (కాంగ్రెస్‌)
న‌ల్గొండ: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (కాంగ్రెస్‌)
వ‌ర్ధ‌న్న‌పేట: కె.ఆర్‌. నాగ‌రాజు (కాంగ్రెస్‌)
బెల్లంప‌ల్లి: వినోద్ (కాంగ్రెస్‌)
ఖ‌మ్మం: తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (కాంగ్రెస్‌)
మంచిర్యాల: ప్రేమ్ సాగ‌ర్ (కాంగ్రెస్‌)
చాంద్రాయ‌ణ‌గుట్ట: అక్బ‌రుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం)
కామారెడ్డి: వెంక‌ట ర‌మ‌ణారెడ్డి (భాజ‌పా)
సిరిసిల్ల‌: కేటీఆర్ (బీఆర్ ఎస్‌)
మ‌ధిర: భ‌ట్టి విక్ర‌మార్క (కాంగ్రెస్‌)

దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలే నిజం కానున్నాయా? లేక బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో బీఆర్ ఎస్ ఆధిక్యాన్ని చూపించేనా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం కాంగ్రెస్ 46 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా బీఆర్‌ ఎస్ మాత్రం 23 స్థానాల్లో మాత్ర‌మే ముందంజ‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం.

Exit mobile version