Velichala Rajender Rao : బీ ఫారం అందుకున్న కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ‘వెలిచాల’

Velichala Rajender Rao
Velichala Rajender Rao : కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును అధిష్టానం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో గురువారం రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ బీ ఫారం సీఎం చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఫొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కాంగ్రస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు పాల్గొన్నారు.
ఖమ్మం, హైదరాబాద్ తో పాటు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ ఎంపీ టికెట్ కోసం వెలిచాల రాజేందర్ రావుతో పాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది. వెలిచాల రాజేందర్ రావుకే అధిష్టానం టికెట్ కేటాయించినట్లు సమాచారం అందింది.