JAISW News Telugu

UP – Congress : యూపీలో కాంగ్రెస్ లీడింగ్

UP - Congress

UP – Congress

UP – Congress : లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఉత్తర్ ప్రదేశ్ చాలా కీలకం. దేశంలోనే ఎంపీ స్థానాలు అత్యధికంగా ఉండే రాష్ట్రం యూపీ. ఇక్కడి 80 సీట్లల్లో ఎక్కువ సీట్లు గెలిస్తే.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కాస్త సులభం అవుతుందని భావిస్తారు. అందుకే యూపీ ఫలితాలు ఎప్పుడూ కీలకంగా ఉంటాయి.

అలాంటి యూపీలో.. ఉదయం 11 గంటల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ 38 చోట్ల లీడింగ్ లో ఉంది. అంచనాలను తలకిందులు చేస్తూ.. ఎస్పీ నేతృత్వంలోని ఇండియా కూటమి 41 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు ఒక చోట ముందంజలో ఉన్నారు.

ఇక మరో కీలక రాష్టం మహారాష్ట్రలో కూడా ఎన్డీఏకు ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇక్కడి 48 సీట్లలో విపక్ష ఇండియా 26 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏకు 19 చోట్ల విజయం దక్కే అవకాశం ఉంది. ఇతరులు మూడు చోట్ల ముందంజలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి  షాక్ తగిలేలా ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ, ప్రస్తుతం 9 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. 42 సీట్లున్న బెంగాల్ లో టీఎంసీ 30 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మూడు చోట్ల అధిక్యంలో కొనసాగుతోంది.

Exit mobile version