Paturi Nagabhushanam : ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ పై అమెరికాలో లంచం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అవి జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఒప్పందాల్లో భాగంగా అధికారులకు అందించారని అమెరికాలోని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. దీంతో బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ ఛార్జి పాతూరి నాగభూషణం తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదానీ, జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ లో శుక్రవారం కోర్టు కు హాజరు కావడమే కాదు న్యూయార్క్ లోని జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రపంచ వ్యాప్తంగా జనాలంతా ఇప్పుడు ఆంధ్ర వైపు చూస్తున్నారన్నారు. జగన్ అవినీతి బాగోతాలు రోజుకి ఒకటి బైటకి వస్తున్నాయన్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి హయంలో గంజాయి వైపు చూశారు. జగన్ కి డైరెక్ట్ గా 1700 వందల కోట్ల రూపాయలు వచ్చాయని పాతూరి నాగభూషణం ఆరోపించారు. జగన్ అధికారం లో ఉన్నప్పుడు రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ గడిచిన 5 నెలల్లో 10పైనే ప్రెస్ మీట్లు పెట్టారని అన్నారు. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్ష కోట్లు సంపాదించాడు అని అభియోగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలోనే జగన్ పై కేసులు ఉన్నాయి. ఇక నుంచి అమెరికాలో కూడా నమోదవుతాయి.
ప్రపంచంలో దేశం స్థాయిని పెంచింది ప్రధాని మోదీ అన్నారు పాతూరి. అవినీతికి అడ్డ కాంగ్రెస్ పార్టీ.. అందులో నుంచి వచ్చిందే పిల్ల కాంగ్రెస్ జగన్ పార్టీ. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రాంతాల్లోనే అదానీకి భూములు కేటాయించారు. రాహుల్ గాంధీ గారికి మతిమరుపు వచ్చినట్లు ఉంది. మన్మోహన్ సింగ్ పీఎం గా ఉన్న సమయంలోనే అదానీని అందలం ఎక్కించారని పాతూరి విమర్శించారు. సోలార్ అవినీతి పై జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నారు అంటే రాష్ట్రాభివృద్ధి కోసమే. ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు ప్రజల వద్దకి వచ్చి మాట్లాడు. మోదీ ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టిస్తున్నారు. దేశంలో ఎక్కడ కరెంట్ కట్ లేదు. జగన్ మీకు ఇంటిలో ఎట్లు మద్దతు లేదు. అసెంబ్లీ కి వస్తే తను ఐదేళ్లలో చేసిన అప్పులు గురించి ఎక్కడ ప్రశ్నిస్తారన్న భయం పట్టుకుందన్నారు పాతూరి. మీ పార్టీ నుంచి ఎవరు వచ్చినా నేను చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు.