
Harish Rao
Harish Rao : ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బోజడ్డ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన పాపానికి చనిపోతున్నానని చెప్పాడని, సీఎం పేరు ప్రస్తావిస్తూ రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ప్రభాకర్ ఆత్మహత్య కారకులను వదిలేసి, వీడియో తీసినవారిపై కేసు పెట్టడం విడ్డూరమని అన్నారు. ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలన్నారు.
అయితే, రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.