Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆగస్టు 15 లోగా అమలు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. సన్నవడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం తెలుపడాన్ని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. దొడ్డు వడ్లను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులేమిటని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మార్చి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని, దొడ్డు వడ్లను కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు.