Congress-BJP : ఏపీ ఎన్నికల ఫలితాలపైనే కాంగ్రెస్, బీజేపీ ఆశలు

Congress-BJP

Congress-BJP

Congress-BJP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నేషనల్ పార్టీలకు కాలం చెల్లింది.  2019 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు గల్లంతయ్యాయి.  బీజేపీ సంగతి పక్కన పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కి కంచుకోట అనదగిన రాష్ట్రంలో ఈ దీన స్థితి రావడం అంటే  ఆ పార్టీకి ఎంతటి చెడ్డ రోజులు దాపురించాయో అర్థం చేసుకోవచ్చు. దేశమంతా ఇందిరాగాంధీని ఓడించి కాంగ్రెస్ ని మట్టి కరిపించినా 1978లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి  పెద్ద పీట వేసి అధికారం అప్పగించిన సందర్భం లేకపోలేదు. కాంగ్రెస్ ఎపుడూ ఇంతలా దిగజారిన పరిస్థితి లేదు. తెలంగాణాలో సైతం రెండు ఎన్నికల తర్వాత మరో సారి అధికారం చేజిక్కించుకుంది.  

ఇక భవిష్యతులో ఏపీలో ఆ అద్భుతం చూడగలమా అన్న అనుమానం కాంగ్రెస్ నేతల్లో కలుగుతోంది. వారికి ఈసారి ఎన్నికల్లో కొంత వరకు ఆశ ఉంది.  నోటా కంటే తక్కువ ఓట్లు రావన్నది ఆ పార్టీనేత నమ్మకం. అంతే కాదు చాలా చోట్ల తమ ఓటింగ్ శాతం పెరుగుతుందని కొందరు చెబుతున్నారు. కనీసంగా రెండు నుంచి మూడు శాతం ఓట్లు సాధించినా తమకు భవిష్యత్ ఆశలు మిగిలి ఉన్నట్లే.  ఇక కాంగ్రెస్ కి అసలైన ఆశ  మరొకటి ఉంది. అదే వైసీపీ ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఓడిపోవడం. కాంగ్రెస్ ఓట్ల పునాదుల మీద నిర్మాణం అయిన వైసీపీ ఓటమి పాలు అయితే  ఆ పార్టీ పేకమేడలా కూలుతుందని..  అందులో ఉన్న వారు తనా మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వారి ఆలోచన.  

అందుకే ఆ పార్టీ 2024 ఎన్నికల ఫలితాల వైపు చాలా ఆశగా చూస్తోంది. ఈ రెండూ జరిగితే తనకు తిరుగులేదని తాము మరోసారి ఆంధ్రాలో గట్టిగా నిలబడవచ్చని కాంగ్రెస్ పెద్దల నమ్మకం.  ఇక బీజేపీ విషయం తీసుకుంటే టీడీపీని కొట్టి ఎదగాలని ఆ పార్టీ 2019 ఎన్నికల వేళ ఆశించింది. టీడీపీ ఓడింది.. బీజేపీ ఆశలు నెరవేరలేదు.  దాంతో ఈసారి  టీడీపీ కూటమిలో చేరి రేపటి రోజున రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రంలో ఎదగాలని చూస్తుంది బీజేపీ.  ఆ విధంగా చూస్తే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచినా ఓడినా కూడా రెండువైపులా లాభం పొందాలని బీజేపీ  ప్లాన్. ఉదాహరణకు టీడీపీ కూటమి గెలిస్తే అందులో కీలక పాత్ర పోషించి ఏపీలోనూ తమ బలం పెంచుకోవడానికి బీజేపీ చూస్తుంది. ఈ క్రమంలో టీడీపీని గుప్పిట పెట్టుకున్నా ఆశ్చర్యం పోనవసరం లేదంటున్నారు నిపుణులు.

TAGS