Congress 6 Guarantees : రేవంత్ 6 హామీలకు రూ.53 వేల కోట్లు! తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ ప్రభుత్వం..!

Congress 6 Guarantees

Congress 6 Guarantees

Congress 6 Guarantees : ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించి రూ.2.75 లక్షల కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చింది. ఈ బడ్జెటే ఆ పార్టీ మొదటి సారి పెట్టడం. రెవెన్యూ, మూలధన వ్యయం వరుసగా రూ.2.01 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా అంచనా వేశారు.

2024 ఆర్థిక సంవత్సరంలో ఇవి వరుసగా రూ.2.11 లక్షల కోట్లు, రూ.37,525 కోట్లుగా ఉన్నాయి. 2024-25 సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ వ్యయం రూ.2,750,891 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, ప్రతిపాదించిన మూలధన వ్యయం రూ.29,669 కోట్లు అని విక్రమార్క తన తొలి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల అమలుకు ప్రభుత్వం రూ.53,196 కోట్లు కేటాయించింది.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు హామీలు అమలు చేసిందని, త్వరలో మరో రెండు హామీలను అమలు చేస్తామన్నారు. మిగిలిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దాని ఫలాలు అర్హులందరికీ అందుతాయని తెలిపారు.

విద్యకు రూ.21,389 కోట్లు, ఆరోగ్యానికి రూ.11,500 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.28,024 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రూ.774 కోట్లు కేటాయించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి రేవంత్ ప్రభుత్వం రూ.21,874 కోట్లు ప్రతిపాదించింది. హైదరాబాద్ లో మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించింది.

TAGS