YS Sharmila : ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మీ పాలన సాగాలి. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తు శాంతిభద్రతలు కాపాడాలి. గడిచిన ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి. పవన్ కళ్యాణ్ సహా మంత్రులందరికీ శుభాకాంక్షలు’’ అని లేఖలో పేర్కొన్నారు.
‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండీ అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిగారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి. వారు చేశారని మీరు, మీరు చేశారని భవిష్యతులో మళ్లీ వాళ్లు, ఇలా ఈ పగ ప్రతీకారాలు అంతు ఉండదు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రగతికి విఘాతం కలగచేస్తుంది’’ అని షర్మిల లేఖలో వెల్లడించారు.