Glass Symbol : గ్లాసు గుర్తుపై గందరగోళం

Glass Symbol

Glass Symbol

Glass Symbol : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీకి  చేదు అనుభవం ఎదురైంది. గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్  అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది. బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల కమిషన్  హైకోర్టును  మంగళవారం 24 గంటల సమయం కోరింది. బుధవారం జరిగిన విచారణలో.. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు కీలక విషయాలను వివరించాు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న ఎంపీ స్థానాల్లో.. గాజు గ్లాసు గుర్తును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వబోమని కోర్టుకు స్పష్టం చేశారు.

అలాగే జనసేన పార్టీ పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ పార్లమెంట్ స్థానాల పరిధిలో పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ తరఫున లాయర్ న్యాయస్థానానికి తెలిపారు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల విషయంలో  ఈ నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలియజేసిన అంశాలతో జనసేనకు కొంత ఊరట కలిగించినా.. మిగిలిన స్థానాల్లో మాత్రం కూటమి అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది.

ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పలు అంశాలను  పేర్కొన్నారు. జనసేన పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో కూడా గాజు గ్లాసు గుర్తు వేరే అభ్యర్థులకు కేటాయించొద్దని కోర్టుకు విన్నవించారు. గాజు గ్లాసు గుర్తు ఎన్నిలక కమిషన్ ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడంతో.. మిగిలిన చోట్ల అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయించకుండా ఎలా ఉంటారని కోర్టు ప్రశ్నించింది.  ఎన్నికల కమిషన్ నిర్ణయంపై అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ వేసుకోవచ్చని కోర్టు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పలు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.  దీంతో జనసేన నాయకులు ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. కోర్టు మాత్రం ఈ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. మరి హైకోర్టు సూచించిన మేరకు మరో పిటిషన్ దాఖలు చేస్తారా.. ఇక్కడికే వదిలేస్తారా అన్నది చూడాల్సిందే.

ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడం టీడీపీ, బీజేపీలకు తలనొప్పిగా మారింది. ఈవీఎంలలో గాజు గ్లాసు గుర్తు ఉంటే.. తమకు పడాల్సిన జనసేన ఓట్లు పొరపాటున ఇండిపెండెంట్లకు పడే అవకాశం ఉందంటున్నారు. మరి టీడీపీ, బీజేపీలు ఏ  నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.

TAGS