Kavitha Bail : గందరగోళంగా కవిత బెయిల్ ..
Kavitha Bail : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ ఆయిన కవితకు బెయిల్ రాకపోవడంతో బిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. సోమవారం రౌస్ అవెన్యూ కోర్ట్ కవిత బెయిల్ ఫిటిషన్ పై తీర్పు వెలువడనుంది. తన అరెస్ట్ అక్రమమని, అకారణంగా తనను అరెస్ట్ చేశారని, తనకు బెయిల్ మంజూరు మంజూరు చేయాలని కోరుతో వేరువేరుగా ఫిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్ట్ న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించనున్నారు.
లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసి యాబై రోజులు దాటింది.అదేవిదంగా సీబీఐ అరెస్ట్ చేసి ఇరువై ఐదు రోజులు దాటింది. ఈ నేపథ్యంలో ఆమెకు ట్రయల్ కోర్ట్ కస్టడీ విధించిన నాటి నుంచి బెయిల్ కోసం ఆమె న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చట్టంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేస్తున్నా కవితకు బెయిల్ రాకపోవడంతో బిఆర్ఎస్ వర్గాలతోపాటు, కవిత కుటుంబ సభ్యులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం కూడా బెయిల్ రాకపోతే పరిస్థితి ఏమిటనేది న్యాయవాదులకు కూడా అంతుపట్టడంలేడు. కవితకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపు న్యాయవాదులు వాదిస్తుండగా, ఆమె లిక్కర్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని ఈడీ, సీబీఐ తరపున లాయర్లు వాదించి కేసును మరింత బలోపేతం చేస్తున్నారు. బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కేసును ప్రభావితం చేసేంత శక్తి, సామర్ధ్యాలు కూడా కవిత కు ఉన్నాయని వాదిస్తూ కేసును మరింత ఇరకాటంలో పెడుతున్నారు. దింతో కవిత బెయిల్ విషయం కఠినంగా తయారవుతోంది.
సోమవారం ఉదయం పది గంటలకు కవితపై ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసులపై విచారణ చేపట్టిన కోర్ట్ బెయిల్ తీర్పు ఇవ్వనుంది. కవితకు బెయిల్ వస్తుందా ? రాదా ? ఒకవేళ రాకుంటే పరిస్థితి ఏమిటి అనే సందిగ్ధంలో పడింది కవిత కుటుంబం. సోమవారం తీర్పు రాని నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల తరువాతనే గట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయని బిఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే గులాబీ అధినేత కేసీఆర్ కవిత కేసులో బలం లేదని, మోదీ కావాలనే నా కూతురు పై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించడం విశేషం .