KCR Style Changing : నాడు ఆత్మవిశ్వాసం.. నేడు అంతులేని భయం.. మారుతున్న కేసీఆర్ శైలి

KCR Style Changing

KCR Style Changing

KCR Style Changing : తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అనే రీతి గతంలో ఉండేది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తూ గడిపినవాళ్లు ఎందరో ఉన్నారు. నాడు ఎంతో ఆత్మవిశ్వాసం తో సాగిన ఆయన ప్రసంగాలు.. నేడు కొంత భయాన్ని అద్దుకొని సాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ రోజుకు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ను మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

ఇక జాతీయ రాజకీయాల్లో కి వెళ్లాలని భావించిన కేసీఆర్, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ మాటమార్చారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులేం బాగాలేవు. అనుకోని రీతిలో కాంగ్రెస్ బలంగా ఢీకొడుతున్నది. అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అంటూ కేంద్రంలో పెత్తనం చెలాయించాలని భావించిన ఆయన, ఇప్పుడు రాష్ర్టంలోనే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా.. ఇందులో చెప్పుకోవాల్సింది అహంకారం. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబందే మొత్తం అన్నట్లు వీళ్ల తీరు నడిచింది. కనీసం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరిన టాక్ వినిపిస్తున్నది.  ఇక హరీశ్ రావును తండ్రీకొడుకులు కలిసి లూప్ లైన్ లో పెట్టడం కొంత ఇబ్బందికరంగా మారింది.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గతంలో తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయాలను బ్రష్టుపట్టించారు. ఇటు బీజేపీ, అటు ఎంఐఎంతో సఖ్యతను ప్రదర్శిస్తూ తనకు కావాల్సిన పనులు కానిచ్చేస్తున్నారు. ఈసారి తెలంగాణలో అన్ని శక్తులు ఏకమై కాంగ్రెస్ వెంట నిలవడంలో ఇదీ ఒక కారణమైంది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధాన బలహీనతను అడ్డు పెట్టుకొని మరోసారి అధికార పీఠమెక్కాలని కేసీఆర్ భావిస్తున్నారు. వారిలో ఐక్యత లేకపోవడం ఇప్పుడు కేసీఆర్ కు వరంగా మారింది.  ఇక కేసీఆర్ కుమ్ముక్కు రాజకీయాలే కాకుండా, పథకాల తీరుపై కూడా ప్రజల్లో తీవ్ర విమర్శలు ఉన్నాయి.

దళితబంధు, బీసీ బంధు, రైతు రుణ మాఫీ విషయంలో చెప్పిన విషయాలను ఆచరణలో చూపించలేకపోయారు. ఎన్నికలు వేస్తే ప్రజలను మభ్యపెట్టి గెలవాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది.  అయితే ముస్లింలు కేవలం ఎంఐఎంను మాత్రమే నమ్ముకొని లేరు. వీరి త్రికోణ స్టోరీ ని వారంతా గమనిస్తూనే ఉన్నారు. ఈసారి ఓటు చీలిక తప్పదనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇక బీజేపీ బండి సంజయ్ మార్పు తర్వాత చాలా బలహీన పడింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు.

అయితే తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొంత స్వయం కృపరాధం చేసుకుంటున్నారు. ఉద్యమ సారథిగా కేసీఆర్ పై చూపిన అభిమానం ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ పై చూపలేకపోతున్నారు. ఎందుకంటే ఆయనలోని ఫక్తు రాజకీయ నాయకుడే ఇప్పుడు ప్రజలకు కనిపిస్తున్నాడు. ప్రజలకు మంచి చేసే నాయకుడు కాదు. నిజానికి మునిపటి కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. కానీ వాటి వెనుక జరిగిన అవినీతి పైనే ఇప్పుడంతా చర్చ జరుగుతున్నది. ఆంధ్రా కాంట్రాక్టర్లకే ఇక్కడ పనులు అప్పగిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు. కేవలం సంక్షేమం అంటూ నిరుద్యోగుల గొంతు కోసిన వైనాన్ని తెలంగాణ మొత్తం గమనిస్తున్నది.

తెలంగాణ లో ఉద్యోగాల కల్పన అతి దారుణ స్థితికి పడిపోయింది. కేవలం పోలీస్ శాఖలో భర్తీ మినహా మరే శాఖలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగలేదు. వేసిన నోటిఫికేషన్లు కాస్త లీకులతో ఆగిపోయాయి. ఇది కూడా తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఏదేమైనా బీఆర్ఎస్ కు తెలంగాణలో అత్యంత గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి.  నాడు ఆత్మవిశ్వాసం అడుగులు వేసిన సీఎం కేసీఆర్.. నేడు కొంత భయంతో ముందుకు సాగుతున్నారు. ప్రజాతీర్పు పై ఆయనకు పూర్తిస్థాయిలో ధీమా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఇదే ఫీలవుతున్నారు. మరి గెలవడానికి ఇంకా ఏం ఏం చేస్తారో మరో పది రోజుల్లో ఒక క్లారిటీ రానుంది.

TAGS