Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల ఆందోళన

Shamshabad Airport
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఆలస్యమైంది. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీ బయలుదేరాల్సిన ఫ్లైట్ ఇంకా విమానాశ్రయం నుంచి వెళ్లలేదు. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు గంటలకు పైగా ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
మైక్రోసాఫ్ట్ సమస్యతో పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే విమానాల రద్దుపై ముందుగా సమాచారం ఇవ్వక పోవడంపై అక్కడ ఉన్న సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదం చేస్తున్నారు.