Banjara Hills Police Station : మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Banjara Hills Police Station
Banjara Hills Police Station : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటు టాలీవుడ్ లోని పలువురు హీరోయిన్లపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ రాఘవేందర్ లకు వేరువేరుగా ఫిర్యాదు కాపీలను అందజేశారు. వెంకటేశ్వర నగర్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి, వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య, హేమ తదితరులు ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు. మంత్రి సురేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసు అధికారులు న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కొండా సురేఖ తక్షణమే మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు నటీమణులందరికీ క్షమాపణ చెపపాలని వారు డిమాండ్ చేశారు.