Two Parties in Telangana : ఆ రెండు పార్టీల మధ్యే పోటీయా?

Two Parties in Telangana

Two Parties in Telangana Compition

Two Parties in Telangana : ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ఉండగానే పలు సంస్థలు  సర్వేలు చేస్తు్న్నాయి. ఏ రాష్ర్టంలో ఏ పార్టీ గెలవబోతున్నది.. ఎన్ని సీట్లుసాధించబోతున్నదనే విషయాలపై సర్వే చేస్తూ, ఆ వివరాలను వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సర్వేలన్నీ అప్పటి వరకు ఉన్న పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధుల పనితీరును బేరీజు వేసుకొని చేసినవే. కానీ నెల క్రితం చేసిన సర్వేకు, ఇప్పుడున్న పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. ఒక్కో సంస్థ సర్వే ఒక్కోలా ఉంటున్నది.  ప్రస్తుతం ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వే వివరాలను కూడా బయట పెట్టింది. అయితే ఈ సర్వేలో నిజమెంత అనేది మాత్రం చెప్పడం కష్టమే.   
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఓ సంస్థ సర్వే చేసింది.  రాష్ర్టంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలపై సర్వే చేసినట్లు వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ఎన్నికలు హోరాహోరీగా ఉంటాయని చెబుతున్నది. ఈ సర్వే ప్రకారం అధికార బీఆర్ఎస్ పార్టీ 55కి పైగా స్థానాలు సాధిస్తుందని వెల్లడించింది. అలాగే జాయతీ పార్టీ కాంగ్రెస్ 40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే మరో జాతీయ పార్టీ అయిన బీజేపీ కేవలం నాలుగు సీట్లకే పరిమితం అవుతుందని తన సర్వేలో పేర్కొంది. అలాగే హైదరాబాద్ పార్టీ ఎంఐఎంకు ఆరు సీట్లు  వస్తాయని పేర్కొంది.  
అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య  22 స్థానాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఉంటుందని వివరించింది.  అలాగే ఉత్తర తెలంగాణలో  అధికార పార్టీ బీఆర్ఎస్ కు, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది.  
జాతీయ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమా? 
ఇప్పటివరకూ పలు సంస్థలు చేసిన సర్వే నివేదికలన్నీ జాతీయ పార్టీ అయిన బీజేపీకి సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమని తమ నివేదికల్లో ప్రకటించాయి. అయితే ఈ సర్వే వివరాలను  బీజేపీ తప్పుబడుతున్నది. వాస్తవాలు డిసెంబర్ 3న వెల్లడవుతాయని చెబుతున్నది. ఈ సర్వేని లెక్కలోకి తీసుకోవాలా వద్దా అనేది తమ నిర్ణయపైనే ఆధారపడి ఉంది.  అయితే ప్రచారానికి మరో 13 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 16 రోజుల్లో ఏ పార్టీ ఉద్ధృతంగా ప్రచారం  చేయడంతో పాటు పార్టీల అభ్యర్థులు కూడా విజయావకాశాలను ప్రభావితం చేయొచ్చు.
TAGS